కర్నూలు ఎన్ ఆర్ పేట లోని శ్రీ లక్ష్మీ పాఠశాల ఎన్ సి సి విద్యార్థులు ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు, పాఠశాల ఎన్ సి సి అధికారి ఎస్. అశ్విని మాట్లాడుతూ ప్రపంచ నదుల దినోత్సవాన్ని మొదటిసారిగా 2005లో అంతర్జాతీయ రివర్ నెట్‌వర్క్ ప్రారంభించిందని తెలిపి నదుల ప్రాముఖ్యతను మరియు వాటి పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ వారం ప్రపంచ నదుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.