యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుతో పాటు సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. భక్తులు గుట్టపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.