కుంటను తలపిస్తున్న బైపాస్ రోడ్డు

61చూసినవారు
ఎమ్మిగనూరులో సోమవారం రాత్రి కురిసిన వర్షంతో గోనెగండ్ల బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచాయి. కొన్ని నెలల క్రితం గోనెగండ్ల బైపాస్ రోడ్డులో కర్నూల్ ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై గుంత ఏర్పడింది. వర్షం వచ్చినప్పుడల్లా వాహనదారులకు గుంత లోతు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఏకంగా ఆ గుంతల్లో వెళ్లి గాయాల పాలవుతున్నారు. గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్