పెద్దకడబూరు - ఆదోని ప్రధాన రహదారిలో ప్రయాణం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. పెద్దకడబూరు నుండి బైచిగేరి క్రాస్ రోడ్డు వరకు రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. ఇక చినుకు పడితే చాలు గుంతల్లో వర్షం నీరు నిల్వ ఉండి వాహనదారులకు నరకం చూపిస్తుంది. గత మూడేళ్లుగా రహదారి మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని చెపుతున్న అధికారులు నేటికి పనులు మొదలు పెట్టక పోవడంపై ఆయా గ్రామాల ప్రజలు బుధవారం పెదవి విరిచారు.