
ఆళ్లగడ్డ: బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బాధిత కుటుంబాలకు సోమవారం పంపిణీ చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దొర్నిపాడు, ఉయ్యాలవాడ, సిరివెళ్ల, రుద్రవరం మండలాలకు చెందిన బాధితులు మొత్తం రూ.3, 81, 000 పొందారు. చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే అఖిల ప్రియకు కృతజ్ఞతలు తెలిపారు.