
ఆళ్లగడ్డలో క్షద్రపూజల కలకలం
ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప కాలనీలో గురువారం క్షుద్రపూజల కలకలం చోటుచేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న ఉమాదేవీ అనే మహిళ గృహం వద్ద కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. తమ ఇంటి వద్ద రెండు రోజుల క్రితం ఇలానే పూజలు చేసి వెళ్లారని అన్నారు. తిరిగి బుధవారం రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు చేశారని చెప్పారు. వీటిపై పోలీసులు దృష్టి సారించాలని కోరారు.