ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెట్రోలు ధరలు తగ్గించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. తమిళనాడు, తెలంగాణతో పోలిస్తే ఏపీలో ధరలు అధికంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు మాని లీటర్ పెట్రోలుపై రూ.17 తగ్గించాలని అన్నారు.