గురువు మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన

63చూసినవారు
గురువు మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన
మార్షల్ ఆర్ట్స్ గురువు, నటులు షిహాన్ హుస్సైనీ (60) మరణవార్త విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ.. 'గురువు మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి పరామర్శించాలనుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని పవన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్