ఆళ్లగడ్డ పట్టణంలోని జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో బుధవారం కన్వీనర్ బీరువాల భాషను రాష్ట్ర మాల మహానాడు జిల్లా నాయకులు పెన్నెం సుధాకర్, ఓబులేసులు తమ మిత్ర బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల కొరకు నిత్యం శాంతియుత మార్గంలో పోరాటం చేసే బీరువాళ్ళ భాష నడవడిక తమకి ఎంతో నచ్చిందని ఆయన అనుసరిస్తున్న మార్గం ఎంతోమందికి అనుసరణీయమని పెన్నం సుధాకర్ అన్నారు.