విమానాశ్రయాలపై పొగమంచు ప్రభావం చూపిస్తోంది. తాజాగా గన్నవరం విమానాశ్రయం రన్ వేపై దట్టంగా పొగమంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. మరోవైపు ఉదయం 9 గంటలైనా రోడ్లపై దట్టమైన పొగమంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.