ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామ టిడిపి నాయకులు, మాజీ జడ్పిటిసి చాంద్ భాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం ఆళ్లగడ్డ నుండి కందుకూరు గ్రామానికి వెళుతుండగా హైవే రహదారి పై కాశీరెడ్డి నాయన పిరమిడ్ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.