ఆలూరు: ఆస్పరిలో మహిళ అదృశ్యం

59చూసినవారు
ఆలూరు: ఆస్పరిలో మహిళ అదృశ్యం
ఆస్పరి మండల కేంద్రానికి చెందిన 48 ఏళ్ల బోయ మహాదేవి అనే మహిళ 10 రోజుల నుంచి కనిపించడం లేదని ఆదివారం ఆస్పరి సీఐ మస్తాన్ వలికి ఫిర్యాదు చేసినట్లు భర్త లక్ష్మన్న తెలిపారు. మహిళకు మతిస్థితిమితం సరిగా లేదని, ఇంటి నుంచి ఎక్కడకు వెళ్లిందో తెలియడం లేదన్నారు. బంధువుల ఇళ్లు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులో వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. మహిళను గుర్తించిన వారు సెల్ 9963570248 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్