దేవనకొండ మండలంలో పలుచోట్ల మంగళవారం వర్షాలు కురిశాయి. వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల నుంచి వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోయే సమయంలో ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. ఇప్పుడు వర్షం వచ్చినా పంటలకు ఏమాత్రం ప్రయోజనం లేదని మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.