కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామికి బెంగళూరుకు చెందిన మురహరి వెంకటేశ్వర్లు శెట్టి దంపతులు బుధవారం అమావాస్యను పురస్కరించుకుని లక్ష పుష్పార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష పుష్పాలతో స్వామివారికి సుందరంగా అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో ఆలయ అధికారి విజయరాజు, తహసిల్దార్ మల్లికార్జున, సూపరింటెండెంట్లు మల్లికార్జున, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.