విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి
విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఆధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రమేశ్, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం అస్పరి మండలం బిల్లేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ నాయకులతో కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. జిల్లా పరిషత్ పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలన్నారు.