బనగానపల్లె హాస్టల్ విద్యార్థినిలకు రక్తహీనతను నివారించండి

73చూసినవారు
బనగానపల్లె హాస్టల్ విద్యార్థినిలకు రక్తహీనతను నివారించండి
బనగానపల్లె మండలం టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సచివాలయం 5 నందు రవ్వలకొండ సమీపానగల ఏపీ మోడల్ బాలికల స్కూల్, మహాత్మ జ్యోతి బాపూలే గురుకులం స్కూల్, బీసీ బాయ్స్ హాస్టల్ నందు వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. పిల్లలకి రక్తహీనత గురికాకుండా, వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకరుడు తెలిపారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్