వైద్యులకు భద్రత కల్పించాలి

75చూసినవారు
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై అవుకు పట్టణంలో డాక్టర్లు మండిపడ్డారు. శనివారం అవుకు బస్టాండ్ వద్ద వైద్యులకు భద్రత కల్పించాలని కోరుతూ నిరసన తెలిపారు. వారు మాట్లాడారు. ప్రాణం పోసే డాక్టర్ల ప్రాణం తీయొద్దని వారు తెలిపారు. స్త్రీలను గౌరవించాలని, బెంగాల్ లో జరిగిన సంఘటనలో నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని వారు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్