డప్పు కళాకారులకు ఎటువంటి ఉపాధి లేక కూలిపని చేసుకుంటూ దయనీయ జీవితంలో బ్రతుకుతున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి దారుణంగా ఉందని సోమవారం ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బాలస్వామి మాదిగ మీడియాతో పంచుకున్నారు. కావున ఏపీ ప్రభుత్వం తక్షణమే పెన్షన్ వెబ్ సైట్ ఓపెన్ చేసి అర్హులైన నిరుపేదల మాదిగలకు న్యాయం చేయవలసిందిగా ఏపీ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆర్కే కంబగిరి స్వామి మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లా కార్యదర్శి బాలస్వామి మాదిగ, కొలిమిగుండ్ల మండలం అధ్యక్షులు పుష్ప వెంకటయ్య మాదిగ, బాల్ ఆంజనేయులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.