ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, రాష్ట్ర ప్రజలపై అధిక భారాలు మోపుతన్న టిడిపి కూటమి ప్రభుత్వం ఫై పోరుకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు ఎ. నాగరాజు మంగళవారం పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ బేతంచర్ల పట్టణ మూడో మహాసభ సందర్భంగా, బేతంచర్ల పాత బస్టాండ్ లో సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు.