మద్యం సేవించి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపరాదని కోడుమూరు ఎస్సై శ్రీనివాసులు సూచించారు. శనివారం కోడుమూరులో ఎస్సై సిబ్బందితో కలిసి డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు. అలాగే ప్రధాన రహదారుల్లో రోడ్డుకు అడ్డంగా నిలిపిన వాహనాలకు కూడా ఎస్సై జరిమానా విధించారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలను ఉంచరాదని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దన్నారు.