కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల నమోదు ప్రక్రియ 99. 66 శాతం పూర్తయిందని వ్యవసాయ జేడీఏ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 15లోపు ఈ-పంట యాప్ లో పంటలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించింది. ఖరీఫ్ సాధారణ సాగు వ 10, 35, 895 ఎకరాలు ఉండగా 10, 40, 908 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 10, 37. 357 ఎకరాల్లో సాగు చేసిన పంటలను నమోదు చేశారు.