Mar 20, 2025, 16:03 IST/
తెలంగాణలో వడగండ్ల వానలు.. ఆరెంట్ అలర్ట్ జారీ
Mar 20, 2025, 16:03 IST
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల నాలుగు రోజుల్లో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం, శనివారం ఉరుములు, మెరుపులు, తీవ్రగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.