కోడుమూరు - Kodumuru Mandal

నిత్యావసర సరుకులు కొనలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

నిత్యావసర సరుకులు కొనలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

అసలే కరోనా మహమ్మారి దెబ్బకు భయంతో చస్తుంటే మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలతో కోడుమూరు పట్టణంలో జనాలు చుక్కలు చూస్తున్నారు. ఉపాధి పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు నిత్యం నిత్యావసర వస్తువుల ధరలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పనులు లేక చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా నలిగిపోయిన జనాలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయక తప్పడం లేదు. మామూలుగా ఉన్న ధరల కంటే భారీగా పెంచేసి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ ఐదవ తేదీ నుండి రెడ్ జోన్ అమలులో ఉన్న కారణంగా ఎవరూ బయటకు రావద్దని సూచిస్తూ కోడుమూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు, కూరగాయలు పట్టణంలోని వ్యాపారుల మొబైల్ వాహనాల ద్వారా అమ్మకాలు చేయిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న పట్టణంలోని పలు ప్రాంతాల్లో మినరల్ వాటర్, నిత్యావసర సరుకులు, కూరగాయలు రావడం లేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. మొదట బాగానే సరఫరా చేయించేందుకు చర్యలు తీసుకున్న తరువాత పర్యవేక్షణ కొరవడింది.

రంగారెడ్డి జిల్లా