కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఎంపిటిసి స్థానాల్లో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం నాయకులు పోటీ చేస్తారని, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునియప్ప, సోమవారం కోడుమూరు సీపీఐ కార్యలయంలో తెలిపారు. ఈ సందర్భంగా కోడుమూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి. కృష్ణ, మండల కార్యదర్శి బి మాధవ స్వామి, ఏఐటీయూసీ కార్యదర్శి బిరాజు, సిపిఎం మండల కార్యదర్శి గఫూర్ మియా ,పట్టణ కార్యదర్శి కె రాజు, తెలియజేశారు. పట్టణంలో ప్రజా సమస్యల కొరకు, పట్టణ సమస్యల కొరకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని, ప్రజల ఆదరాభిమానాలు వామపక్షాలు ఉన్నాయని తెలిపారు.
ప్రజా శ్రేయస్సు కొరకే తాము ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో పాల్గొంటున్న అని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు భీముని స్వామి, దూల భాస్కర్, తిమ్మప్ప, షేర్ ఖాన్, గూడూరు శీను, సిపిఎం నాయకులు గఫూర్, ఈరన్న, బజ్జీల వీరన్న తదితరులు పాల్గొన్నారు.