రేపు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం
రేపు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంతో పాటు అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదివారం తెలిపారు. స్పందన కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలు స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారుల స్పందనకు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.