కౌతాళం ఆర్ టి సి బస్టాండ్ ఆవరణంలో డివైఎఫ్ఐ నాయకులు సురేష్, రాజు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురేష్, రాజు సేవా కార్యక్రమంలో నిత్యము ప్రజల మధ్య ఉండి సేవ చేయడంలో ముందున్నారని కొనియాడారు. డివైఎఫ్ఐ యువకుల కోసం ప్రతి నిత్యము వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాటం చేయడంలో యువజన సంఘం ముందుండి పోరాటం చేస్తున్నది.
ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రయాణికులు నీళ్ల కోసం చాలా అవస్థలు పడుతున్నారు. హోటల్ దగ్గరికి పోయి నిన్ను అడిగితే టీ తాగితే నీళ్లు ఇస్తామని అంటున్నారు, అలాంటివారికి మీ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కావున ప్రయాణికులందరూ చలివేంద్రం దగ్గర నీళ్లు తాగి దప్పిక తీర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.