మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన పలువురిని నేతలు పరామర్శించారు. ముందుగా పాతవూరు లో నివాసముంటున్న అర్చక చక్రపాణి ఆచార్యులు గత కొద్ది రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న. విషయం తెలుసుకున్న పెద్దాయన ఎమ్మిగనూర్ ఆర్టీసి డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదే విధంగా గత కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి గాయపడిన శివప్ప గురు ఇంటర్నేషనల్ లాడ్జ్ లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి తదితరులు ఉన్నారు.