అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్థానిక జడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్ లో ఎం. రాజు మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వకృత్వా మరియు వ్యాసరచన పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SI ధనుంజయ్ మరియు అంబేద్కర్ విగ్రహా నిర్మాణ కమిటీ సభ్యులు రామన్న, విజయ్ కుమార్ దుర్గప్ప, మరెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక మహా జ్ఞాని అని అలాంటి వారి జీవిత చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని వారు అన్నారు. ఇలాంటి మహానుభావులందరిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ పోటీలకు సుమారు 103 మంది విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ పోటీలకు టీచర్స్ భాస్కర్, రుక్మన్, సిద్ధప్ప, అడివప్పలు జర్జిమెంట్స్ గా వ్యవహరించారు.
ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి రోజున బహుమతులు అందజేస్తారని వారు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు చింతకుంట సమేల్, బి. నరసింహులు, ప్రకాష్, సునంద రాజు, ప్రవీణ్, నాగరాజు, ఈరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.