వైస్సార్ భీమా పేదలకు వరం

2236చూసినవారు
వైస్సార్ భీమా పేదలకు వరం
వైఎస్సార్ బీమా పేదలకు వరమని మంత్రాలయం మాజీ వైస్ ఎంపీపీ వెంకోబా అన్నారు. సోమవారం మంత్రాలయం మండల పరిధి లోని రచ్చమర్రి గ్రామానికి చెందిన పల్లెపాడు వీరేష్ స్వగ్రామం నుంచి మాలపల్లి కి ఆటోలో వెళ్తుండగా సౌట్ పల్లి క్రాస్ వద్ద ఆటో స్కూల్ బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పల్లెపాడు వీరేష్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. విషయం రాంపురం రెడ్డి సోదరుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో వైఎస్సార్ బీమా పథకం కింద రూ 5 లక్షలు మంజూరయ్యాయి.

మంజురైన నగదును భార్య గోవిందమ్మ ఖాతాలో జమ చేయనున్నట్లు వెంకోబా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను మంగళవారం బాధితుల ఇంటి వద్దకు వెళ్లి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ భారతి, వాలంటరీ వీరేష్ వైఎస్సార్సీపీ నాయకులు రోగప్ప, బొజ్జప్ప, లక్ష్మయ్య, రవి రెడ్డి, రాము, నాగేంద్ర, దుబ్బన, శంకరప్ప తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్