విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి

12520చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి
పాములపాడు మండలం పాములపాడు బస్టాండ్ వద్ద రైతు ధాన్యాల కమిషన్ వ్యాపారి ఫారుక్ భాష (53) గోడౌన్ లో మంగళవారం షార్ట్ సర్క్యూట్ తో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫారుక్ భాష మృతి చెందాడు. అలాగే కోటిన్నర రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఫారుక్ భాష గోడౌన్ లో సెల్లు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్