నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని వినూత్నంగా అగ్గిపెట్టెపై 60 సూక్ష్మ వినాయకుల చిత్రాలు వేసి శుక్రవారం అబ్బురపరిచారు. 2అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పుగల అగ్గిపెట్టెపై మైక్రో బ్రష్ తో 2గంటల వ్యవధిలో 60 సూక్ష్మ గణపతులను వివిధ రూపాలతో వాటర్ కలర్స్ తో వేశారు. వినాయకచవితి పండుగకు స్వామి చిత్రాలను వేస్తున్నాను. ఈసారి అగ్గిపెట్టె మీద వేసానన్నారు.