నంద్యాల జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తు వారి యొక్క సంక్షేమంలో భాగంగా ప్రతి శుక్రవారం పోలీసుల సమస్యల పరిష్కారం కొరకు పోలీస్ వెల్ఫేర్ డే గ్రీవెన్స్ డే ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అది రాజ సింగ్ రాణా తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది వారి యొక్క సమస్యలు, విధుల సమస్యలను జిల్లా ఎస్పీ కి విన్నవించుకున్నారు.