ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ బుక్ లెట్ ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా డివిజనల్ రెవిన్యూ అధికారి పద్మజకు సంఘం సభ్యులు బుక్ లెట్ ను బుధవారం అందించారు. సభ్యులు నాగేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గ సభ్యుల వివరాలు, తీసుకొన్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు ఇలా పూర్తి సమాచారంతో కూడిన బుక్ లెట్ ను ఆవిష్కరించామని తెలిపారు.