నంద్యాలలో మంత్రి ఫరూక్ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ సంఘసంస్కర్తలలో జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారన్నారు. అణగారిన వర్గాల కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని ఆయనను కొనియాడారు.