నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో సుమారు 250 మందికిపైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ద్వారా, ట్రాఫిక్ నిబంధనలు ఉన్న పోస్టర్ల ద్వారా రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అర్కే ఫంక్షన్ హాల్ నందు నంద్యాల లారీ, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.