నంద్యాలలోని బాలాకాడమీ పాఠశాలలో రోటరీ క్లబ్, ఉదయానంద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ గీతావాణి మాట్లాడుతూ నేటి మానవ జీవనంలో మనం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య క్యాన్సర్ అని, ఈ క్యాన్సర్పై అవగాహన తప్పనిసరి అన్నారు. క్యాన్సర్ పై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, సలహాలు సూచనలు చేశారు.