నంద్యాలలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ముగిశాయి. గంగిశెట్టి దీపక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేషాల పోటీల ముగింపు సందర్భంగా టిడిపి నాయకులు ఫయాజ్ హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన విజేతలకు వారు నగదు బహుమతులను పంపిణీ చేశారు. దీపక్ కుమార్ మాట్లాడుతూ దసరా వేషాల పోటీల్లో పెద్ద ఎత్తున టీంలు పాల్గొన్నాయని, ప్రజలు కూడా ఆసక్తిగా పోటీలను తిలకించాలని తెలిపారు. పోటీలను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.