నంద్యాల పట్టణ టీడీపీ నాయకులు చిలకల సుబ్బారాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి సగర బంధువులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. త్వరలో ఏడడుగులు వేస్తున్న జంటకు అన్ని శుభాలు కలగాలని కార్యక్రమానికి వచ్చిన అతిథులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.