నంద్యాల: బావిలో పడిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు

63చూసినవారు
బావిలో పడిన వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. ఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మంగళవారం ప్రమాదవశాత్తు కాలుజారి నేల బావిలో పడింది. ఈత రాక సహాయం కోసం కేకులు పెట్టింది. ఆమె కేకలు విన్న ఆత్మకూర్ పిఎస్‌ పోలీసు సిబ్బంది గమనించి బావి వద్దకు వెళ్లారు. నీట మునిగిపోతున్న ఆమెను బావిలోకి దూకి కాపాడారు. సురక్షితంగా బయటకు తీశారు. పోలీసుల సాహసాన్ని పలువురు మెచ్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్