నంద్యాల కొండాపురం కాలనీలో జరిగిన చోరీ కేసును తాలూకా పోలీసులు చేదించారు. కిరణ్ బాబు, హుస్సేన్ భాష అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు సోమవారం తరలించారు. పలు కేసుల్లో ముద్దాయిలు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 7. 5 తులాల బంగారం, 500 గ్రాముల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నంద్యాల తాలూకా సిఐ అస్తార్ భాష నంద్యాలలో వెల్లడించారు.