గిద్దలూరులో శ్రీసగర భగీరథ సేవాసంఘం ఆధ్వర్యంలో రేపు వనభోజనాలు

74చూసినవారు
గిద్దలూరులో శ్రీసగర భగీరథ సేవాసంఘం ఆధ్వర్యంలో రేపు వనభోజనాలు
గిద్దలూరు పట్టణంలో శ్రీ సగర భగీరథ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ సగర భగీరథ సేవా సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల పరిధిలోని సగరుల ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముండ్లపాడు రోడ్డులోని శ్రీ భగీరథ ఆలయం వద్ద రేపు వనభోజన మహోత్సవాలు ప్రారంభం అవుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్