ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం పుర్తిగా విఫలమైందని ఎస్టీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతకుంట నాగరాజు, కాళంగిరి రామకృష్ణ అన్నారు. నంద్యాలలోని ఎస్టీటీఎఫ్ కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు జవహర్‌లాల్ నాయక్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించను విధానం అమలు చేస్తామని చెప్పి సీఎం
జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు.