సామజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకున్న ప్రజలు

473చూసినవారు
సామజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకున్న ప్రజలు
కర్నూలు జిల్లా, నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణంలో ఆదివారం ముఖ్యమంత్రి కరోనా వైరస్ కట్టడికి నిర్వహిస్తున్న లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి బ్రతుకు భారంగా జీవనం సాగించే పరిస్థితులలో ప్రభుత్వం తరుపున చేయూత ఇచ్చేందుకు ఉచితంగా బియ్యం, శనగల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టణంలో 28 వ వార్డులో రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకున్న తీరు అందరికి ఆదర్శంగా నిలిచారు. వీరిని చూసి అందరు ఇలానే కొనసాగితే కరోనా కట్టడి చేయావచ్చని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్