నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధురాలికి అస్వస్థతకు గురైంది. మంగళవారం పాణ్యంలో 108 సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్య లేదని చెప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాణ్యం బస్టాండ్లో వృద్ధురాలిని దింపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొంగనపాడుకు చెందిన వృద్ధురాలికి వైద్యపరీక్షల నిమిత్తం నంద్యాలకు వచ్చి, తిరిగి బస్సులో వెళ్తుండగా ఇలా జరిగింది.