ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఓర్వకల్లు తహసీల్దారు విద్యాసాగర్ ను ఆదేశించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడారు. కొత్తగా ఓటరు నమోదుకు ఏమైన దరఖాస్తులు వచ్చాయా? అధికారులను ఆరా తీశారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.