ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. మంగళవారం పాణ్యం నియోజకవర్గంలోని చాపిరేవుల, మద్దూరు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, మాట్లాడారు. మాత శిశు సంరక్షణ సేవలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ప్రమాద సంకేత లక్షణాలున్న గర్భవతులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు.