Dec 11, 2024, 16:12 IST/షాద్నగర్
షాద్నగర్
విజేతలకు బహుమతులు ప్రధానం
Dec 11, 2024, 16:12 IST
ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడలపై ఆసక్తిని ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జండగూడెం సుదర్శన్ గౌడ్ సూచించారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయ మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ బహుమతులను అందజేశారు.