ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇంటిని అమ్మేందుకు భార్య ఒప్పుకోలేదని ఆమె భర్త 18 సెకన్లలో 11 సార్లు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. మృతి చెందిన మహిళను 50 ఏళ్ల రమాదేవిగా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం నిందితుడు దాధీచ్ తప్పించుకోగా, ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రమాదేవి కూతురు రాఖీ మాట్లాడుతూ, తన తల్లి మరణానికి తన తమ్ముడు, అతడి భార్య కూడా కారణమన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.