రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఇందులో భాగంగానే సీప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. మంగళవారం శ్రీశైలంలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.