మహానంది మండలం ఆర్. ఎస్ గాజులపల్లి గ్రామంలోని రైల్వే స్టేషన్ పనుల్లో భాగంగా అధికారులు ముందస్తుగా ఎటువంటి సమాచారం అందించకపోవడంతో ఆ రహదారిలో రాకపోకలు సాగించే వానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలంటే, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.